ETV Bharat / state

Nalgonda IT Tower Inauguration 2023 : అక్టోబర్ 2న నల్గొండ ఐటీ హబ్ ప్రారంభోత్సవం.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా..? - నల్గొండ ఐటీ టవర్​లో ఎంత మంది పనిచేస్తారు

Nalgonda IT Tower Inauguration 2023 : నల్గొండ పట్టణంలో నిర్మిస్తున్న ఐటీ టవర్‌ నిర్మాణం తుది దశకు చేరింది. ఈ భవనాన్ని వచ్చే నెల 2వ తేదీన మంత్రులు కేటీఆర్​, జగదీశ్‌రెడ్డి ప్రారంభించనున్నారు. రూ.90 కోట్లలతో నల్గొండ - హైదరాబాద్‌ రహదారి పక్కనే ఐటీ టవర్‌ను నిర్మించారు. ఈ అత్యాధునిక భవనం.. పూర్తిగా గ్రీన్‌ బిల్డింగ్‌ తరహాలో నిర్మితమవుతూ ప్రత్యేకత సంతరించుకుంది.

Green Building in Nalgonda IT Tower
IT Hub in Nalgonda
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 26, 2023, 11:21 AM IST

Nalgonda IT Tower Inauguration 2023 అక్టోబర్ 2న నల్గొండ ఐటీ హబ్ ప్రారంభోత్సవం.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా..

Nalgonda IT Tower Inauguration 2023 : హైదరాబాద్‌ లాంటి రాజధాని ప్రాంతాల్లోనే కాకుండా నల్గొండ తరహా ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని.. నిరుద్యోగులకు ఐటీ ఉపాధి సేవలు అందించాలనే లక్ష్యంతో నల్గొండలో ఐటీ టవర్‌(Nalgonda IT Tower) నిర్మాణానికి 2021 డిసెంబరు 31న మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ ఐటీ హబ్​లో పని చేసేందుకు తొలి దశలో 17 కంపెనీలు ముందుకు వచ్చాయి. ఇందులో సుమారు 1200 మందికి ఉద్యోగాలు ఇచ్చి తమ కంపెనీ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

Nalgonda IT Tower Opening in October 2023 : ప్రస్తుతం ఒక షిప్ట్​కి సుమారు 1200 మంది ఉద్యోగులు పనిచేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడాదిలో రెండు షిప్ట్​లు, ఏడాదిన్నరలో మూడు షిప్ట్​లు పనిచేసే విధంగా కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని తెలిసింది. ఇటీవల నిర్వహించిన జాబ్‌మేళాలో కొంత మంది నిరుద్యోగులను కంపెనీలు ఎంపిక చేసుకోగా.. మరికొంత మందిని కళాశాల ప్రాంగణంలోనే ఎంపిక చేసుకున్నాయి. ఎక్కువగా అమెరికాలో పనిచేస్తున్న నల్గొండ ఎన్​ఆర్​ఐలకే చెందిన సంస్థలే ఇక్కడ ఉన్నాయి.

KTR To Inaugurate Nizamabad IT Hub : నిజామాబాద్​లో​ ఐటీ టవర్​ను ప్రారంభించిన కేటీఆర్.. నిరుద్యోగులకు హామీ​

Nalgonda IT Tower Specialties : రోజంతా సహజసిద్ధంగా వెలుతురూ వచ్చేలా భవనాన్ని జీ+5 పద్ధతిలో గ్రీన్‌ బిల్డింగ్‌ తరహాలో నిర్మించారు. నీరు వృధా కాకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉపయోగించిన నీటిని పూర్తిగా తిరిగి వినియోగించేలా 50 వేల లీటర్ల సీవరేజ్​ ప్లాంట్​ను నిర్మించారు. గ్రౌండ్​ ఫ్లోర్​తో పాటు రెండో అంతస్తులో ఇంటర్నల్​ గార్డెన్​(Internal Garden)ను ఏర్పాటు చేశారు.

వర్షపు నీటిని పూర్తిగా ఉపయోగించేలా భవనం వెనుక భాగంలో ఇంకుడు గుంత నిర్మిస్తున్నారు. సుమారు మూడెకరాల విస్తీర్ణంలో ఎక్కడ వర్షం పడినా.. ఆ నీరంతా నేరుగా ఆ ఇంకుడుగుంతలోకి వెళ్లేలా ప్రణాళిక చేశారు. భవనం అంతా సెంట్రల్​ ఏసీతో పనిచేసేలా నిర్మించారు. ఇందుకోసం అదనంగా విద్యుత్​ అవసరం అవుతోంది. దీంతో రానున్న కాలంలో భవన విద్యుత్‌ అవసరాలను పూర్తిగా సోలార్‌ ద్వారానే తీర్చుకునే విధంగా త్వరలోనే సోలార్‌ ప్యానెళ్లను ఏర్పాటు చేయనున్నారు.

" ప్రభుత్వం రూ.90 కోట్లు కేటాయించి.. నల్గొండలో ఐటీ హబ్​ని నిర్మించేందుకు ముందుకు వచ్చింది. ఈ భవనాన్ని చాలా వేగంవంతంగా పూర్తి చేశాం. అక్టోబర్​ 2న ప్రారంభోత్సవానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందులో 3600 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. ఇప్పటికే ఏడు కంపెనీ పని చేసేందుకు ముందుకు వచ్చాయి. మరో 23 కంపెనీలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి." - కంచర్ల భూపాల్‌ రెడ్డి, ఎమ్మెల్యే, నల్గొండ

KTR Inaugurates IT HUB in Nalgonda : ఏడాదిన్నరలోనే అత్యాధునిక భవనం అందుబాటులోకి తీసుకువచ్చామని.. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డి తెలిపారు. స్థానికంగానే ఐటీ కొలువులు దక్కడంతో.. ఉద్యోగాలకు ఎంపికైన యువత సంతోషం వ్యక్తం చేస్తోంది. భవిష్యత్‌లో మరిన్ని కంపెనీలు వస్తాయని ఆశిస్తోంది.

Siddipet IT Hub Inauguration : 'తెలంగాణ మోడల్‌ అంటే సమగ్ర, సమ్మిళిత, సమీకృత, సమతుల్య అభివృద్ధి'

Nizamabad IT HUB Inauguration : ప్రారంభోత్సవానికి ముస్తాబైన నిజామాబాద్ ఐటీ హబ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.