ETV Bharat / state

Nalgonda IT Hub : సెప్టెంబర్​లో నల్గొండ ఐటీ హబ్​ ప్రారంభోత్సవం - IT Hub Inauguration in Nalgonda

Nalgonda IT Hub : మొన్నటిదాకా ఐటీ అంటే కేవలం హైదరాబాద్ మాత్రమే అనుకునే వారు. కానీ, ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి ననగరాలకు కూడా వ్యాప్తి చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే నల్గొండకు ఐటీ హబ్​ను ప్రభుత్వం మంజూరు చేసింది. ఐటీ హబ్ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావడంతో సెప్టెంబర్ రెండో వారంలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు రంగం సిద్ధమవుతోంది.

Nalgonda IT tower
Nalgonda IT Hub Inauguration
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2023, 1:34 PM IST

Nalgonda IT Hub : రాష్ట్రంలో ఐటీ(IT Sector) రంగాన్ని హైదరాబాద్​ నగరానికే పరిమితం చేయకుండా ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా వ్యాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఒకప్పుడు ఐటీ జాబ్ చేయాలంటే హైదరాబాద్, చెన్నై, నోయిడా, దిల్లీ, బెంగళూరు, ముంబయి వంటి నగరాల వైపే చూసేవారు. కానీ ఐటీ పరిశ్రమను ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించే దిశగా రాష్ట్ర సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది.

Nalgonda IT Tower : ఇప్పటి వరకు వరంగల్, ఖమ్మం, కరీంనగర్ నగరాల్లో ఐటీ హబ్ నిర్మించారు. తర్వాత దశలో మహబూబ్​నగర్, నిజామాబాద్, సిద్దిపేటలతో పాటు నల్గొండకు ఐటీ హబ్​ను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికే మహబూబ్​నగర్, నిజామాబాద్, సిద్దిపేటలలో ఐటీ టవర్లు ప్రారంభమయ్యాయి. వాటిలో ఐటీ కార్యకలాపాలు కూడా షురూ అయిన విషయం తెలిసిందే. ఇక నల్గొండ ఐటీ హబ్​ను ప్రకటించిన వెంటనే పనులు మొదలు పెట్టారు. 2021 డిసెంబర్ 28న సీఎం కేసీఆర్ నల్గొండ సందర్శించిన సందర్భంగా అభివృద్ధిపై సమీక్షిస్తూ.. అభివృద్ధి పనులతో పాటు ఐటీ హబ్(Nalgonda IT Hub)​ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

KTR To Inaugurate Nalgonda IT Hub in September : ఆ వెంటనే జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్​లో గల పాలిటెక్నిక్ కాలేజీ స్థలాన్ని ఐటీ హబ్ నిర్మాణానికి కేటాయించారు. అదే ఏడాది ఐటీ శాఖ మంత్రి కేటీఆర్(IT Minister KTR) నల్గొండ పర్యటనకు వచ్చిన సందర్భంగా.. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్​ రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో కలిసి ఐటీ హబ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఐటీ హబ్ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావడంతో సెప్టెంబర్ రెండో వారంలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నద్ధం చేస్తున్నారు.

Siddipet IT Tower Inauguration : సిద్దిపేట సిగలో మరో మణిహారం.. రేపే ఐటీ హబ్ ప్రారంభం

అతి త్వరలో ప్రారంభం.. : సుమారు రూ.90 కోట్లతో నిర్మిస్తున్న ఈ ఐటీ హబ్​ను సెప్టెంబర్ రెండో వారంలో ప్రారంభించనున్నారు. నల్గొండలోని ఐటీ టవర్ కార్యకలాపాల నిర్వహణకు ఇప్పటికే ఆయా కంపెనీలతో ఐటీ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(Telangana Academy for Skill and Knowledge) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నారు. సుమారు 15 కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొననున్నాయి.

Nalgonda IT Hub Inauguration in September : నల్గొండ నడి ఒడ్డున ఐటీ హబ్ నిర్మాణం పూర్తి కావడంతో జిల్లాలో చదువుతున్న యువతలో ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లా పరిధిలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉండటంతో ప్రతి ఏడాది 15 వేల మంది విద్యార్థులు చదువును పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు. కొలువు కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ ముంబై మొదలైన నగరాలకు ఉద్యోగ రీత్యా వలస వెళుతున్నారు. జిల్లా కేంద్రంలోనే ఐటీ టవర్ నిర్మించడంతో ఇప్పుడు ఆ సమస్యకు చమరగీతం పాడొచ్చని యువత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Nizamabad IT HUB Inauguration : ప్రారంభోత్సవానికి ముస్తాబైన నిజామాబాద్ ఐటీ హబ్

Harish Rao on Siddipet IT Tower : 'సిద్దిపేటకు ఐటీ టవర్ తీసుకురావాలన్న నా కల.. ఇవాళ కళ్లేదుట కనబడుతోంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.