ETV Bharat / state

నాన్న కాదు...నరరూప రాక్షసుడు - తండ్రి

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కుమారుడి గొంతు నులిమి, కొరికి, మెడపై పిన్నీసుతో గుచ్చి అత్యంత కర్కశంగా హత్య చేశాడు. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం తిర్మలరాయినిగూడెంలో ఈ దారుణం వెలుగుచూసింది.

నాన్న కాదు...నరరూప రాక్షసుడు
author img

By

Published : Aug 10, 2019, 8:02 AM IST

Updated : Aug 10, 2019, 1:21 PM IST

అభంశుభం తెలియని నాలుగేళ్ల బాలుడిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాలయముడయ్యాడు. గొంతు నులిమి, కొరికి, మెడపై పిన్నీసుతో గుచ్చి అత్యంత కర్కశంగా హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం తిర్మలరాయినిగూడెంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల కేంద్రానికి చెందిన చింతల కనకయ్య, స్వప్న దంపతులకు కుమార్తె అక్షిత(6), కుమారుడు అక్షయ్‌(4) ఉన్నారు. బతుకుతెరువు కోసం పిల్లలతో కలిసి వారు కొంతకాలంగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. నెల క్రితం భార్యభర్తల మధ్య ఘర్షణ జరగడం వల్ల కనకయ్య తన కుమారుడు అక్షిత్‌ను తీసుకొని తిర్మలరాయిని గూడెంలోని తన పెదనాన్న చింతల రాములు ఇంటికి వచ్చేశాడు. రోజూ కూలి పనికి వెళ్తూ నెలరోజులుగా ఇక్కడే ఉంటున్నాడు.

చిన్నారి అక్షయ్‌ బాగోగులు చూడటానికి ఇబ్బందిగా ఉందని వచ్చి బాలుడిని తీసుకెళితే బాగుంటుందని చింతల రాములు కుటుంబ సభ్యులు స్వప్నకు ఫోన్‌ చేసి చెప్పారు. ఆమె అంగీకరించి రెండు మూడు రోజుల్లో వచ్చి తీసుకెళ్తానని చెప్పింది. ఈ విషయం కనకయ్యకు తెలియటంతో ఆగ్రహానికి గురయ్యాడు. గురువారం బోనాల పండుగ కావడం వల్ల రాత్రి మద్యం తాగి ఉన్మాదిలా మారాడు. అర్ధరాత్రి దాటాక తన పక్కన నిద్రిస్తున్న కుమారుడు అక్షయ్‌ను గొంతు నులమడమే కాకుండా... శరీరంపై పలుచోట్ల కొరికి, మెడపై పిన్నీసుతో గుచ్చి గుచ్చి కిరాతకంగా హత్య చేశాడు. కొడుకు ఆమెకు దక్కకూడదనే దురుద్దేశంతోనే ఇలాంటి దారుణానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నట్లు సీఐ క్యాస్ట్రోరెడ్డి పేర్కొన్నారు.

నాన్న కాదు...నరరూప రాక్షసుడు

ఇదీ చూడండి : పశువుల అక్రమ రవాణా... అడ్డుకున్న భాజపా కార్యకర్తలు

Last Updated : Aug 10, 2019, 1:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.