వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో 9 నెలల పాపపై జరిగిన అఘాయిత్యాన్ని ఖండిస్తూ నల్గొండ జిల్లా తేనెపల్లి సర్పంచి వడిత్య రజిత ముఖ్యమంత్రికి లేఖ రాశారు. నిందితుడు ప్రవీణ్‌కు ఉరిశిక్ష విధించాలని పేర్కొన్నారు. ఇలాంటి వాళ్లని వదిలేస్తే మరెంతో మంది చిన్నారులు, ఆడపడుచుల జీవితాలను నాశనం చేస్తారంటూ రజిత లేఖలో ప్రస్తావించారు. దేశం తలదించుకునేలా చేసిన ఇలాంటి వాళ్లకి కఠిన శిక్షలు అమలు చేయాలని కోరారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాల ఆపేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని సర్పంచి రజిత విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: ఎస్కలేటర్‌పై అజాగ్రత్త- క్షణాల్లో బాలుడు మృతి