నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం పనులను ఇంఛార్జి కలెక్టర్ వి. చంద్రశేఖర్ పరిశీరించారు. సర్జిపూల్, టన్నెల్ పనుల పురోగతిపై అధికారులను ఆరా తీశారు. లైనింగ్ పనులు 90 శాతం, పంప్‌హౌస్ పనులు పూర్తైనట్లు తెలిపారు. కాలువల నిర్మాణానికి 3వేల 880 ఎకరాల భూమి కావాల్సి ఉండగా... 1310 ఎకరాల భూమి సేకరించినట్లు వెల్లడించారు. టన్నెల్ లైనింగ్ పూర్తి కావటానికి సంవత్సరం పడుతుందన్నారు. కలెక్టర్‌తో పాటు ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, ఏఎంఆర్పీ ఎస్ఈ సాయిబాబా, ఈఈ యాదన్ కుమార్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'ఉద్యోగాలు పోతే వారి కుటుంబాలు ఆర్థికంగా చనిపోతాయి'