నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నల్గొండ కలెక్టర్ చంద్రశేఖర్ పర్యటించారు. నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఏర్పడ్డ హాలియా, నందికొండ మున్సిపాలిటీలను సందర్శించారు. జనవరి 22న జరిగే పురపాలిక ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితా తయారీ, ఎన్నికల ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు.ఎన్నికల రిటర్నింగ్ అధికారులతోపాటు అన్ని విభాగాల్లో నోడల్ అధికారులను నియమించారు. పోలీస్ స్టేషన్‌కి కావల్సిన మెటీరియల్ అందించారు. ప్రభుత్వం నుంచి రిజర్వేషన్లు రాగానే... ఎన్నికల ప్రక్రియను ప్రారంభించి, 25న కౌటింగ్ చేపట్టనున్నట్లు వెల్లడించారు.
ఇవీ చూడండి: తెలంగాణ నూతన సీఎస్‌గా సోమేశ్ కుమార్