పౌరసత్వ సవరణ చట్టం( సీఏఏ), జాతీయ పౌరసత్వం రిజిస్టర్ (ఎన్ఆర్సీ)లపై ప్రభుత్వం వ్యతిరేక తీర్మానం ప్రకటించడాన్ని నల్గొండ జిల్లా భాజపా అధ్యక్షుడు నూకల నర్సింహరెడ్డి తప్పుబట్టారు. ఈ చట్టాల వల్ల రాష్ట్ర ప్రజలకు కలిగే నష్టమేంటని ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రశ్నించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఇతర దేశాల నుంచి వచ్చి మనదేశంలో స్థిరపడ్డవారిని తిరిగి పంపించే చట్టాలను వ్యతిరేకించడం తగదన్నారు.
కొన్ని పార్టీలకు, మైనార్టీలకు భయపడి కేసీఆర్.. ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నారని నర్సింహరెడ్డి ఆరోపించారు. రాష్ట్రపతి, పార్లమెంట్ ఆమోదించిన బిల్లులను విమర్శించడం సరికాదని పేర్కొన్నారు. చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తామని తెలిపారు.