ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం మంగళవారం కాస్తా తగ్గుముఖం పట్టటం వల్ల నాగార్జునసాగర్ జలాశయంలో 4 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. నేడు సాగర్‌కు ఇన్‌ఫ్లోగా 2లక్షల 78 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండటం వల్ల 16 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి స్పిల్‌వే నుంచి 2,39 వేల క్యూసెక్కుల వరద నీటిని పులిచింతలకు విడుదల చేస్తున్నారు.
సాగర్ మొత్తం నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.90 అడుగులకు చేరింది. మొత్తం నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా... 311.44 టీఎంసీల నీరు నిల్వ ఉందిం. జలాశయం దిగువన ఉన్న ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి 28 వేల క్యూసెక్కుల నీరు... సాగర్ కుడి కాలువ ద్వారా 8 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. మొత్తం నాగార్జునసాగర్ జలాశయం నుంచి ఔట్‌ఫ్లోగా 2 లక్షల 78 వేల క్యూసెక్కులుగా ఉంది.