ETV Bharat / state

రాష్ట్రమిచ్చిన కాంగ్రెస్​ను గెలిపించండి: జానారెడ్డి - కాంగ్రెస్​ జనగర్జన తాజా వార్తలు

ప్రజల ఆకాంక్షను గౌరవించి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్​ను గెలిపించాలని నాగార్జునసాగర్​ కాంగ్రెస్​ అభ్యర్థి జానారెడ్డి కోరారు. నల్గొండ జిల్లా హాలియాలో జరిగిన కాంగ్రెస్‌ జనగర్జన సభలో పాల్గొన్నారు. తన వల్ల పదవులు పొందిన వారు తనపైకే వస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు.

janareddy
జానారెడ్డి
author img

By

Published : Mar 27, 2021, 7:49 PM IST

కాంగ్రెస్​ అనేక ప్రాజెక్టులు కట్టి సాగు నీరు ఇచ్చిందని నాగార్జునసాగర్​ కాంగ్రెస్​ అభ్యర్థి జానా రెడ్డి చెప్పారు. నల్గొండ జిల్లా హాలియాలో జరిగిన కాంగ్రెస్‌ జనగర్జన సభలో పాల్గొన్నారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. నాగార్జునసాగర్​ ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో ఆరున్నర లక్షల ఎకరాలకు నీరు అందించామని.. శ్రీశైలం ఎడమ కాలువ ద్వారా సమారు 3 లక్షల ఎకరాలకు సాగు నీరందించామన్నారు. ప్రజల ఆకాంక్షను గౌరవించి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్​ను గెలిపించాలన్నారు.

తెలంగాణ కోసం తమ పదవులు త్యాగం చేశామని చెప్పారు. కాంగ్రెస్​ ఎన్నో పథకాలు తీసుకొచ్చిందన్నారు. ఉపాధి హామీ చట్టం, ఆహార భద్రత చట్టం, సమాచార హక్కు చట్టం తెచ్చామని తెలిపారు. ఉప ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్న తెరాస ఎమ్మెల్యేలు, ఎంపీలు తెలంగాణ రాష్ట్ర రాకపోతే కనీసం సర్పంచులు కూడా కాలేకపోయేవారని చెప్పారు. కాంగ్రెస్​ గుర్తుతో గెలిచి పార్టీ మారిన వారికి ప్రశ్నంచే అర్హత లేదన్నారు. తన వల్ల అనేక మందికి పదవులు వచ్చాయని వారే తనపైకి వస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:నాగార్జునసాగర్​కు తెరాస చేసింది శూన్యం: ఉత్తమ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.