ETV Bharat / state

సాగర్​కి పోటెత్తిన వరద.. 20 గేట్లు ఎత్తివేత

రాష్ట్రంలో భారీగా కురిసిన వర్షాలతో నాగార్జున సాగర్​కి వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి పెరిగిన ప్రవాహంతో 6 లక్షల 79 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టుకి చేరుతోంది. దీంతో 20 గేట్లను ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

nagarjuna sagar twenty gates opened nalgonda district
సాగర్​కి పోటెత్తిన వరద.. 20 గేట్లు ఎత్తివేత
author img

By

Published : Oct 16, 2020, 2:17 PM IST

నాగార్జున సాగర్​ జలాశయం ఎగువ నుంచి భారీగా వరద రావడంతో ప్రాజెక్టుకి 6 లక్షల 79 వేల క్యూసెక్కుల వరద నీరు చేరింది. దీంతో సాగర్ 20 గేట్లను 25 అడుగుల మేరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

  • సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 589.40 అడుగులు
  • ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312.04 టీఎంసీలు, ప్రస్తుత నీటి సామర్థ్యం 309.05 టీఎంసీలు
  • ఇన్​ ఫ్లో 6 లక్షల 79 వేల క్యూసెక్కులు కాగా అంతే మొత్తంలో ఔట్ ఫ్లో వెళ్తోంది.

గేట్లను ఎత్తి వేయడం ద్వారా దిగువన ఉన్న పుష్కరఘాట్​లోని శివాలయం మెట్ల వరకు వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సాగర్​కి పోటెత్తిన వరద.. 20 గేట్లు ఎత్తివేత

ఇదీ చదవండి: త్రీడి వీడియోలు చూసి పురుడు పోసిన యువకుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.