నల్గొండ జిల్లా నాగార్జున సాగర్(Nagarjuna sagar project) జలాశయానికి ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు ఇప్పటికే నిండుకుండలా ఉండటంతో వరద ప్రవాహాన్ని బట్టి అధికారులు.. 4 క్రస్టు గేట్లు(gates open) 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 82వేల 244 క్యూసెక్కులు కాగా.. అంతే మొత్తంలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. స్పిల్ వే ద్వారా 32వేల క్యూసెక్కులు, ప్రధాన విద్యుదుత్పత్తి ద్వారా 32 వేలు, సాగర్ కుడి, ఎడమ కాల్వలకు 15వేల క్యూసెక్కుల మేర సాగు నీటిని విడుదల చేస్తున్నారు.
ఉదయం నుంచి 6 క్రస్టు గేట్లు ఎత్తిన అధికారులు.. వరద ప్రవాహం కొద్దిగా తగ్గడంతో 4 గేట్లు ఎత్తివేశారు. ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 589.60 అడుగుల వద్ద కొనసాగుతోంది. . జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 310.84 టీఎంసీలుగా ఉంది.
ఎస్సారెస్పీ 32 గేట్లు ఎత్తివేత
నిజామాబాద్ జిల్లా శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు(SRSP)కి వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టు ఎగువన కురుస్తున్న భారీవర్షాలతో జలాశయానికి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి లక్షా 18 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. 32 గేట్లు ఎత్తి లక్షా 12 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం ప్రస్తుత నీటిమట్టం 1090.90 అడుగులుగా ఉంది.
ఇదీ చదవండి: Dragon Fruit Cultivation in Telangana: బంజరు భూముల్లో.. బంగారం పండిస్తూ..