ETV Bharat / state

గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న సాగర్​ అభ్యర్థులు - నాగార్జునసాగర్ ఎన్నికల ప్రచారం

నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. గెలుపు కోసం అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. బరిలో ఉన్నవారికి మద్దతుగా సీనియర్‌ నాయకులు ప్రజల్లోకి వెళుతున్నారు. ఇంటింటికీ వెళ్లి తమ పార్టీనే గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.

nagarjuna Sagar by election, Nagarjunasagar by poll news
గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న సాగర్​ అభ్యర్థులు
author img

By

Published : Apr 5, 2021, 8:09 PM IST

గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న సాగర్​ అభ్యర్థులు

పోలింగ్‌ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ... నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు. గ్రామ గ్రామాల్లో పర్యటించి ఓటర్లను కలుసుకుంటున్నారు. ఉప ఎన్నికలో తమ పార్టీనే గెలిపించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. అభివృద్ధి అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్తున్న తెరాస... నోముల భగత్‌కు పట్టం కట్టాలంటూ ప్రచారం చేస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి... నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పెద్దవుర మండలంలో నోముల భగత్‌తోపాటు విప్‌ బాల్క సుమన్, ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య ప్రచారంలో పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి తెరాసనే గెలిపించాలని ఓటర్లకు విన్నవించుకున్నారు.

హామీలు నెరవేరుస్తాం

త్రిపురారం మండలంలో నోముల భగత్‌కు మద్దతుగా మంత్రి తలసాని శ్రీనివాస్ ‌యాదవ్‌ ప్రచారం చేశారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గ అభివృద్ధిని కోరుకునే నర్సింహయ్య ఆశయాలను కొనసాగించేలా... ఉపఎన్నికలో భగత్‌ను గెలిపించాలని తలసాని కోరారు. తెరాస ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని పేర్కొన్నారు.

అమలులో విఫలం

అనుముల మండలం శ్రీనాథపురం, చింతగూడెం, రామడుగులో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ప్రచారం నిర్వహించారు. ఆయనకు మద్దతుగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ ‌కుమార్‌ యాదవ్‌ పాల్గొన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్‌ చేసిన అభివృద్ధి తప్ప... రెండేళ్లలో తెరాస చేసిందేమి లేదని జానారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్​ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. తెరాసకు గుణపాఠం చెప్పేలా ఉపఎన్నికలో కాంగ్రెస్‌ను గెలిపించాలని... జానారెడ్డి ఓటర్లను కోరారు.

అనుభవం ఉన్న వారినే..

నిడమనూరు మండలంలో ఊటుకూరు, బంటివారి గూడెంలో కాంగ్రెస్ తరఫున పొన్నం ప్రభాకర్, జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి ప్రచారం చేశారు. రాజకీయ అనుభవం ఉన్న జానారెడ్డిని గెలిపించి... నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ఓటర్లకు పొన్నం ప్రభాకర్‌ విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి : సాగర్​లో కాంగ్రెస్, తెరాస మధ్యనే పోటీ: ఉత్తమ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.