ETV Bharat / state

26 గేట్ల ద్వారా కిందకు దూకుతూ కృష్ణమ్మ కనువిందు - నాగార్జున సాగర్ వద్ద పర్యాటకుల సందడి

nagarjuna sagar 26 gates open నాగార్జున సాగర్​కు కృష్ణమ్మ పరుగులు ఆగడం లేదు గురువారం నుండి వరద ప్రవాహం అధికంగా ఉండడంతో 26 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ అందాలు చూసేందుకు ఇవాళ భారీగా పర్యటకులు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు అందుకు తగ్గట్లుగా ట్రాఫిక్ సమస్య లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

sagar
sagar
author img

By

Published : Aug 14, 2022, 9:49 AM IST

Updated : Aug 14, 2022, 10:23 AM IST

nagarjuna sagar 26 gates open: ఎగువనుంచి వస్తున్న ప్రవాహంతో నాగార్జున సాగర్ కళకళ సంతరించుకుంది. ఇప్పటికే జలాశయం నిండటంతో 26 క్రస్ట్ గేట్లలో 2 గేట్లని 5 అడుగుల మేరకు, 24 గేట్లని 10 అడుగుల మేరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్​కు ప్రస్తుతం ఇన్ ఫ్లో 3 లక్షల 22 వేల 931 క్యూసెక్కులుగా ఉంది. ఔట్ ఫ్లో 4 లక్షల 3వేల 70 క్యూసెక్కులు. నీటి ప్రవాహం ఆధారంగా గేట్లను ఎత్తును తగ్గించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు.

పర్యటకుల సందడి: నాగార్జున సాగర్ మొత్తం నీటి మట్టం 590 అడుగులకు ప్రస్తుతం 585.60 అడుగులుగా ఉంది. పూర్తి నిల్వ సామర్ధ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 298.98 టీఎంసీలకు చేరింది. 26 క్రస్ట్ గేట్లను ఎత్తడంతో పర్యటకుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉంది. అందుకు తగ్గట్లుగా ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

పులిచింతల కళకళ: మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లను 15 అడుగుల మేర ఎత్తి మూడున్నర లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. పులిచింతల జలాశయం పూర్తి స్థాయి నీటమట్టం 175 అడుగులకు 168 అడుగుల వద్ద నీటిమట్టం కొనసాగిస్తున్నారు. ఈ ప్రాజెక్టు నుంచి 13 గేట్ల ద్వారా 3 లక్షల క్యూసెక్కులు కిందకు విడిచిపెడుతున్నారు.

సాగర్​లో ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ.. 26 గేట్ల ద్వారా కిందకు దూకుతూ కనువిందు..

ఇవీ చదవండి :

1947 నుంచి ఇప్పటివరకు స్వేచ్ఛాభారతంలో ఎన్ని మార్పులో

Last Updated : Aug 14, 2022, 10:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.