MUSI PROJECT: గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు ఆరు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 3209.65 క్యూసెక్కులు ఉండగా.. అవుట్ ఫ్లో 6582.69 క్యూసెక్కులుగా ఉంది. మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా.. ప్రస్తుతం 640.35గా ఉంది. పూర్తిస్థాయి సామర్థ్యం 4.46 టీఎంసీలు. భారీ వరద వస్తుండటంతో ప్రాజెక్టు దిగువనున్న గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జాలర్లు ఎవ్వరూ వేటకు వెళ్లవద్దని సూచించారు.
ఇవీ చదవండి: రాష్ట్రంలో కుండపోత.. లోతట్టు ప్రాంతాలు జలమయం.. నేడూ, రేపూ అతి భారీ వర్షాలు