Palvai Sravanti Complaint to EC: మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ సజావుగా సాగుతోంది. ఉదయం మందకొడిగా సాగినా.. ఆ తర్వాత నెమ్మదిగా ఊపందుకుంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు నిఘా పెడుతున్నారు. మునుగోడులో ప్రధాన పార్టీలైన తెరాస, భాజపా, కాంగ్రెస్ అభ్యర్థులు వారి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ దృష్టికి 28 ఫిర్యాదులు రాగా.. తాజాగా పాల్వాయి స్రవంతి సైతం ఈసీని ఆశ్రయించారు. తన ఫొటో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ వారిపై చట్టపరంగా తగు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
" class="align-text-top noRightClick twitterSection" data=""మీకు దమ్ము, ధైర్యం ఉంటే నన్ను ఎన్నికల్లో ఎదుర్కొండి. నేను నైతికంగా బతికన మహిళను. నేను నమ్ముకున్న పార్టీని విడిచిపెట్టే మహిళను కాను. ఆ నైతికత నాకు మా తండ్రి నుంచి వచ్చింది. ఏదో ఇలాంటి పనుల వల్ల నా మనోధైర్యం దెబ్బకొట్టాలని చూస్తే అది మీ పిచ్చి పని. ఇలాంటి వాటిని సహించేది లేదు. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తున్నా". -పాల్వయి స్రవంతి, మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి.
Munugode bypoll: దుష్ప్రచారం చేసినవారికి నోటీసులు పంపిస్తా: పాల్వాయి స్రవంతి#PalvaiSravanthi #congress #Munugodebypoll #Eenadu #Telugunews #Telangana pic.twitter.com/PtlPxceK9I
— Eenadu (@eenadulivenews) November 3, 2022
">Munugode bypoll: దుష్ప్రచారం చేసినవారికి నోటీసులు పంపిస్తా: పాల్వాయి స్రవంతి#PalvaiSravanthi #congress #Munugodebypoll #Eenadu #Telugunews #Telangana pic.twitter.com/PtlPxceK9I