మునుగోడు ఉపఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ గడువు నేటితో ముగిసింది. అక్టోబరు 7న ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కాగా.. అక్టోబరు 14న నామినేషన్ల ప్రక్రియ ముగిసే సరికి మొత్తంగా 130 మంది అభ్యర్థులు 199 నామినేషన్లు దాఖలు చేశారు. పరిశీలనలో 47 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. మిగిలిన 83 మంది అభ్యర్థు్ల్లో 36 మంది ఇవాళ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో మొత్తంగా 47 మంది అభ్యర్థులు ఉపఎన్నిక బరిలో ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఇవీ చూడండి..
మునుగోడులో వాహన తనిఖీలు.. రూ.కోటి పట్టివేత
'భార్యల మార్పిడి గేమ్'కు భర్త డిమాండ్.. హోటల్లో బంధించి దారుణం