ETV Bharat / state

త్వరలో ఉద్యోగాల నోటిఫికేషన్ : పల్లా రాజేశ్వర్ రెడ్డి

నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల మైదానంలో.. ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రాడ్యుయేట్స్ ఓటర్లు తనను ఆశీర్వదించి కేసీఆర్ ప్రభుత్వానికి మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు.

MLC candidate Palla Rajeshwar Reddy campaigned for Morning Walkers on the grounds of NG College in Nalgonda
త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్: పల్లా రాజేశ్వర్ రెడ్డి
author img

By

Published : Jan 31, 2021, 11:59 AM IST

నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మార్నింగ్ వాకర్స్​తో ముచ్చటించిన ఆయన.. గ్రాడ్యుయేట్ ఓటర్లు తనను ఆశీర్వదించి తెరాస ప్రభుత్వానికి మద్దతు పలకాలని కోరారు.

సీఎం హామీ..

వచ్చే ఏడాదిలోపు ఎస్ఎల్​బీసీ, మునుగోడు, దేవరకొండ ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు త్వరితగతిన పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ మేరకు సీఎం హామీ ఇచ్చారని తెలిపారు.

ఉద్యోగ నోటిఫికేషన్..

ఇప్పటి వరకు లక్ష 31 ఉద్యోగాలు ఇచ్చినట్లు.. త్వరలో ఉద్యోగులకు పదోన్నతులు, పీఆర్​సీలు ఇవ్వనున్నట్లు తెలిపారు. నిరుద్యోగుల కోసం అతి త్వరలో 50 నుంచి 60 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనునట్లు తెలిపారు. ఈ ప్రచారంలో స్థానిక శాసన సభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ మందడి సైదిరెడ్డి, కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:ఆమె సేవలకు గుర్తింపు..జాతీయ పురస్కారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.