ETV Bharat / state

వారు నియోజకవర్గ అభివృద్ధిని మరిచారు: ఎమ్మెల్యే రఘునందన్ రావు - ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే రఘునందన్​

ఏడేళ్ల తెరాస పాలనలో సీఎం కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​ రావు ఆరోపించారు. నాగార్జున సాగర్​ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన భాజపా అభ్యర్థిని గెలిపించాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Nagarjuna sagar election campaign
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే రఘునందన్​
author img

By

Published : Apr 9, 2021, 10:39 PM IST

నాగార్జున సాగర్​కు 40 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహించిన జానారెడ్డి, ఏడేళ్లుగా అధికారంలో ఉన్న తెరాస ఎమ్మెల్యేలు ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోలేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​ రావు విమర్శించారు. నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం ఆల్వాల, శ్రీరాంపల్లి, రంగుండ్ల గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సాగర్ ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థి రవి కుమార్​ను గెలిపించాలని ఓటర్లను కోరారు.

జానారెడ్డి, కేసీఆర్​లకు ఒకరిని ఒకరు పొగుడుకోవడానికే సమయం సరిపోదని ఎమ్మెల్యే రఘనందన్ రావు అన్నారు. తెరాస ప్రభుత్వంలో ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సాగర్ ఉప ఎన్నికలో దుబ్బాక ఫలితమే పునరావృతం కాబోతోందని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: వర్సిటీల నియామకాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.