ETV Bharat / state

రైతులను ఆదుకోవాలంటూ కోమటిరెడ్డి ఒకరోజు దీక్ష - mla protest news

నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక రోజు నిరాహారదీక్ష చేపట్టారు. భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్​ చేశారు. జిల్లాలో బత్తాయి, నిమ్మ రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు.

రైతులను ఆదుకోవాలంటూ కోమటిరెడ్డి ఒకరోజు నిరసన దీక్ష

author img

By

Published : Oct 22, 2020, 5:09 PM IST

భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక రోజు నిరాహారదీక్ష చేపట్టారు. పత్తిని సాగు చేయిమని చెప్పిన ప్రభుత్వం... అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని కోమటిరెడ్డి విమర్శించారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు తెరవకుండా పత్తిని కొనుగోలు చేయకపోవడమంటే పత్తి దళారులను ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయన్నారు.

సీసీఐ కొనుగోలు కేంద్రాలను తెరిపించి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. నష్టపోయిన రైతులను తెరాస ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకు పరామర్శించలేదో చెప్పాలన్నారు. తేమతో సంబంధం లేకుండా దిగుబడి చేసిన పత్తికి మద్దతు ధర ప్రకటించాలన్నారు. జిల్లాలో బత్తాయి, నిమ్మ రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటకే పరిమితమైన అభివృద్ధి దక్షిణ తెలంగాణ జిల్లాల అభివృద్ధిపై సవతితల్లి ప్రేమ ఎందుకని ప్రశ్నించారు.

ఇదీ చూడండి: బాలుడి కిడ్నాప్ దృశ్యాలు.. ఇదిగో లైవ్ వీడియో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.