నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లాక్ డౌన్లో జీవనోపాధి కోల్పోయిన 650 మంది ఆటోడ్రైవర్లకు… ఎన్బీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే భాస్కరరావు అందజేశారు. కరోనాను నిర్ములించడానికి ప్రభుత్వం కఠినమైన ఆంక్షలను అమలు చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.
ప్రజలు, కార్మికులు, ఆటో డ్రైవర్లు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తమ తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలన్నారు. మాస్కులు, శానిటైజర్లు వాడుతూ… తగు జాగ్రత్తలతో కరోనాను జయించాలని అన్నారు. ఈ సందర్భంగా ఎన్బీఆర్ ఫౌండేషన్ను ఆయన అభినందించారు.
ఇదీ చూడండి: 'కరోనా దోపిడీ' బాధితులకు తిరిగి డబ్బులు ఇప్పిస్తారా?