నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే భాస్కరరావు చెక్కుల పంపిణీ చేశారు. మొత్తం 64 మంది లబ్ధిదారులకు చెక్కులు అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పేద కుటుంబాలను ఆదుకోవడంలో ఎల్లప్పుడూ ముందు ఉంటుందని పేర్కొన్నారు. ఈ పథకాల విషయంలో అధికారులు ఎవరైనా లంచం అడిగితే వెంటనే తెలియజేయాలని సూచించారు.
ఇవీ చూడండి: దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణం... చూపరులకు కనువిందు