నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారం జోరందుకుంది. తిరుమలగిరి మండలం ఎర్ర చెరువు, నెల్లికల్, జాలు తండాల్లో తెరాస అభ్యర్థి నోముల భగత్‌తో కలిసి మంత్రులు జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. తెరాసకు మరోసారి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తామని, పోడుభూములకు పట్టాలు అందిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: మాస్కులు లేకుండానే రోడ్లపైకి.. కరోనా నిబంధనలు గాలికి..