నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్ఎల్బీసీ సాగర్రోడ్డు వద్ద పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ బండ నరేందర్ రెడ్డిలు కలిసి కేక్ కట్ చేసి మొక్కలు నాటారు.
రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేస్తున్న డైనమిక్ నేత మంత్రి కేటీఆర్ అని ఎమ్మెల్యే కొనియాడారు. ఐటీ, ఇండస్ట్రియల్ రంగాల్లో మంత్రి కేటీఆర్ చేసిన అభివృద్ధితో ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని అన్నారు. ఈ వేడుకల్లో మున్సిపల్ ఛైర్మన్, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, పార్టీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.