ETV Bharat / state

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చింది.. కేసీఆర్​: మంత్రి జగదీశ్​ - Minister Jagadish Speech

నల్గొండ జిల్లాలో మంత్రి జగదీశ్​రెడ్డి పర్యటించారు. జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్​లో పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్నారు.

jagadish reddy
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చింది.. కేసీఆర్​: మంత్రి జగదీశ్​
author img

By

Published : Dec 21, 2020, 7:45 PM IST

నల్గొండ జిల్లా కేంద్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి జగదీశ్​రెడ్డి శంకుస్థాపన చేశారు. జిల్లాలోని మర్రిగూడ బైపాస్​ నుంచి జిల్లా కలెక్టర్​ కార్యాలయం వరకు ఆరు లైన్ల రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించారు. అలాగే 6 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన తరగతి గదులకు భవన నిర్మాణానికి శంకుస్థాపన పనులకు శ్రీకారం చుట్టారు.

అనంతరం అక్కడి నుంచి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్​లో పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి... కేంద్ర వ్యవసాయ చట్టాలతో మార్కెట్​ కమిటీలు, వ్యవసాయ మార్కెట్​లు నామమాత్రంగా ఉంటున్నాయని వెల్లడించారు. అంతిమంగా రైతులు నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు.

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల బాధలను తీర్చి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చారని వ్యాఖ్యానించారు. కేసీఆర్​ రైతుల జేబులు నింపుతుంటే.. మోదీ ప్రభుత్వం రైతుల జేబులకు చిల్లు పెట్టి కార్పొరేట్​ సంస్థల జేబులు నింపుతున్నారని ఆరోపించారు.

రైతులకు సంకెళ్లు వేసి వ్యాపారస్తులకు ద్వారాలు తెరుస్తున్నారని అన్నారు. దేశంలోనే కాదు... ప్రపంచంలో ఎక్కడా లేని పథకాలు తీసుకొచ్చి... కేసీఆర్ రైతులను ఆదుకున్నారని కొనియాడారు.

ఇదీ చూడండి: కలెక్టర్​ ఎదుటే రైతు ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.