పురపాలికలో సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. నందికొండ పురపాలక సంఘం కార్యాలయంలో ఛైర్మన్, కౌన్సిలర్ల పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి, పట్టణ ప్రగతి కార్యక్రమానికి మంత్రి జగదీశ్ రెడ్డి హాజరయ్యారు.
వార్డుల్లో తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నందికొండ పురపాలక సంఘాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.