ETV Bharat / state

ఎమ్మెల్సీ ఎన్నికలకు సన్నద్ధం కండి : జగదీశ్​రెడ్డి - నల్గొండ జిల్లా తాజా వార్తలు

ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని మంత్రి జగదీశ్​రెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఒక ప్రణాళికతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించాలని సూచించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

minister jagadeesh reddy participated in MLC Election Preparatory Meeting
ఒక ప్రణాళికతో ఎమ్మెల్సీ ఎన్నికలకు సన్నద్ధం కావాలి: జగదీశ్​రెడ్డి
author img

By

Published : Oct 20, 2020, 6:53 PM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. విద్యుత్​ శాఖ మంత్రి జగదీశ్​రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

గ్రామాలు, మండలాలు, పట్టణాల్లో ఉన్న పట్టభద్రులను గుర్తించి.. జాబితా తయారు చేసుకొని ఎమ్మెల్సీ ఎన్నికలకు సన్నద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా వెల్లడించారు.

కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్​, ఎమ్మెల్యే భాస్కర్ రావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తెరాస పార్టీ ఎన్నికల ఇంఛార్జీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి.. నాయినికి ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత పరామర్శ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.