మున్నూరు కాపు సంఘం సభ్యులందరూ ఏకతాటిపై నడవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆకాంక్షించారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ విజయ్ విహార్‌లో రాష్ట్ర మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో రెండు రోజులపాటు శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నారు. మొదటి రోజైన గురువారం మంత్రి హాజరయ్యారు.
జిల్లా అధ్యక్షులకు, నియోజకవర్గ సమన్వయకర్తలకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ సంస్థ ఛైర్మన్ వీరమళ్ల ప్రకాశ్, మున్నూరు కాపు సంఘం నేతలు, నిపుణులు హాజరయ్యారు.
ఇదీ చదవండి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్, సీపీ అంజనీకుమార్ టగ్ ఆఫ్ వార్