ETV Bharat / state

హమ్మయ్య: ఇక ఇంటికెళ్లిపోవచ్చు! - migrant labor goes to native from nalgonda

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో పలు వర్గాలు ఊరట చెందాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో తీవ్ర ఆందోళన చెందిన వలస కూలీలు, కార్మికులు, పర్యాటకులు, విద్యార్థులను స్వస్థలాలకు పంపేందుకు సన్నాహాలు చేయాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం రాష్ట్రాలకు మార్గదర్శకాలను విడుదల చేసింది.

migrant labor goes to their native from nalgonda during lock down
ఊరుకో.. వెళ్దామిక
author img

By

Published : May 1, 2020, 9:56 AM IST

లాక్​డౌన్​తో ఇబ్బంది పడుతున్న వలస కూలీలు, కార్మికులు, పర్యాటకులు, విద్యార్థులను స్వస్థలాలకు పంపేందుకు సన్నాహాలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మూడు కలెక్టరేట్ల పరిధిలోని వివిధ శాఖల అధికారులు కార్మికుల సమాచార సేకరణలో నిమగ్నమయ్యారు. వీరిని రెండు దశల్లో గుర్తిస్తున్నారు. కార్మిక., పరిశ్రమల శాఖల్లో పేర్లు నమోదు చేసుకున్న వారి వివరాలు ఇప్పటికే ఆయా కలెక్టర్లకు అందాయి. మొదటి దశలో వీటిని సేకరించారు. రెండో దశలో మిగిలినవారు తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

భువనగిరి జిల్లాలో ఇప్పటికే రెండు దశలను పూర్తిచేశారు. ఇక్కడ మొదటిదశలో 22 వేల మందిని గుర్తించగా, రెండోదశలో ఆరు వేల మందిని గుర్తించారు. విభాజ్య నల్గొండ జిల్లాలో 15,925 మందిని అధికారికంగా గుర్తించారు. వీరిలో మన రాష్ట్రానికి చెందిన ఇతర జిల్లాల వారు 551 మంది ఉన్నారు. మిగిలిన వారిని త్వరలోనే గుర్తిస్తామని అధికారులు చెబుతున్నారు.

సూర్యాపేట జిల్లాలో 6,579 మంది వలస కూలీలను ఇప్పటివరకు గుర్తించారు. పెద్దవూర మండలం చలకుర్తి వద్ద జవహర్‌ నవోదయ విద్యాలయంలో మధ్యప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన అనేకమంది విద్యార్థులు శిక్షణ నిమిత్తం మధ్యప్రదేశ్‌ వెళ్లి అక్కడే ఉండిపోయారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో వీరందరిని సొంత ప్రాంతాలకు చేరుస్తామని జిల్లా యంత్రాంగం తెలిపింది.

ఇటుక బట్టీ కార్మికులే అధికం

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇటుకబట్టీ కార్మికులు అధికంగా ఉన్నారు. చౌటుప్పల్‌, బొమ్మలరామారం, మిర్యాలగూడ, మునుగోడు, ఆలేరు, నకిరేకల్‌ ప్రాంతాల్లో.. ఒడిశా, బిహార్‌, చత్తీస్‌ఘఢ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందినవారే అధికంగా ఉన్నారు. రెండో స్థానంలో ఉమ్మడి జిల్లాకు సరిహద్దు ప్రాంతాలైన గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలకు చెందిన భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. వీరంతా నల్గొండ, సూర్యాపేట, కోదాడ, భువనగిరి ప్రాంతాల్లో ఎప్పటినుంచో పనిచేస్తున్నారు.

వ్యవసాయ రంగాన్ని పరిశీలిస్తే.. బిహార్‌ నుంచి వచ్చిన హమాలీలు ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉంటారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఉమ్మడి జిల్లాలో చాలా తక్కువగా ఉన్నారు. కృష్ణపట్టి ప్రాంతంలోని దేవరకొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌, కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో పలు పరిశ్రమలున్నాయి. సిమెంట్‌, రైస్‌ మిల్లులు అధికంగా ఉన్నాయి. వీటిల్లో పనిచేసేందుకు బిహార్‌, గుజరాత్‌, ఒడిశా, చత్తీస్‌ఘడ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి వచ్ఛి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో చిక్కుకుపోయారు.

మిర్చి అధికంగా సాగయ్యే ఉమ్మడి మేళ్లచెరువు మండలానికి ఆంధ్రా ప్రాంతం నుంచి కూలీలు వలస వచ్చారు. వరికోతల సీజనులో మార్కెట్టు యార్డుల్లో పనిచేయటానికి వచ్చే హమాలీలు బిహార్‌కు చెందిన వారే. వీరిలో 60 శాతం మంది కుటుంబాలతో సహా రాగా.. మిగిలిన వారంతా ఒంటరిగా వచ్చారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మహారాష్ట్ర, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు ఉపాధి నిమిత్తం వందల మంది వెళ్లారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసులు అధికంగా ఉన్నాయి. అక్కడి నుంచి జిల్లాకు రావాలనుకునే వారు కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకోవాలి. అందులో నెగిటివ్‌ వచ్చినట్లు ధ్రువీకరిస్తేనే జిల్లాలోకి అనుమతిస్తారు. విధిగా 28 రోజులు హోం క్వారంటైన్‌లో ఉంటామనే స్వీయ ధ్రువీకరణ పత్రం కూడా అందజేయాల్సి ఉంటుంది.

వెళ్లాలా? వద్దా?

కొద్దిరోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నుంచి ఇటుక బట్టీలకు మినహాయింపులిచ్చింది. అదీకాక వారి సొంత ప్రాంతాల్లో కంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, రాష్ట్ర ప్రభుత్వం నెలకు 12 కేజీల బియ్యం, రూ.500 ఇస్తుండడంతో ఇక్కడ ఉండేందుకే మొగ్గు చూపుతారా?లేక సొంత రాష్ట్రాలకు వెళతారా? అనే వివరాలనూ అధికారులు సేకరిస్తున్నారు. ఎవరైనా వలస కార్మికులు సమూహాలుగా వచ్చి వివరాలు నమోదు చేసుకుంటే వారిని స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తామని అధికార యంత్రాంగం తెలిపింది.

వాహనాలు సమకూర్చుకుంటే పంపుతాం

ఇతర రాష్ట్రాలకు వెళ్లే కూలీలు సొంతంగా వాహనాలు సమకూర్చుకుని.. స్థానిక అధికారులకు సమాచారం అందించాలి. అందులో ప్రయాణించేవారి సంఖ్య, వివరాలతోపాటు ఎక్కడికి వెళ్లాలనే వివరాలు స్పష్టంగా తెలియజేయాలి. అక్కడి అధికారులతో సంప్రదించి.. పాసులు జారీచేస్తాం. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న జిల్లావాసులు నేరుగా ఇక్కడి అధికారులకు సమాచారం అందించాలి. వెంటనే అక్కడి అధికారులతో సమన్వయం చేసుకుని ఇక్కడి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటాం.

- వినయ్‌ కృష్ణారెడ్డి, పాలనాధికారి, సూర్యాపేట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.