ETV Bharat / state

సాగర్ చెక్ పోస్టు వద్ద పటిష్ఠంగా తనిఖీల నిర్వహణ

author img

By

Published : May 14, 2021, 6:24 PM IST

లక్ డౌన్ వేళ ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. నాగార్జునసాగర్ నూతన వంతెన వద్ద లాక్ డౌన్ పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీ నుంచి రాష్ట్రంలోకి వస్తున్న అంబులెన్సులను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.

LOCK DOWN AT SAGER CHEAK POST IN NALGONDA DISTRICT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నూతన వంతెన వద్ద లాక్ డౌన్ పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీ నుంచి రాష్ట్రంలోకి వస్తున్న అంబులెన్సులను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. అంబులెన్సుకు సంబంధించిన ఆస్పత్రి అనుమతి పత్రం గాని, కోవిడ్ కంట్రోల్ రూమ్ జారీచేసిన అనుమతి పత్రం గాని తీసుకువస్తేనే రాష్ట్రంలోకి అనుమతి ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ-పాస్ అనుమతి ఉన్న ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోకి రావాలంటే అనుమతి పత్రాలు తప్పకుండా ఉండాలని సాగర్ సర్కిల్ ఇన్సిపెక్టర్ తెలిపారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.