నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో తెరాసకు మద్ధతు తెలిపే అంశంపై కమ్యూనిస్టులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ ఎన్నికల్లో కామ్రేడ్లు పోటీకి దూరంగా ఉన్నారు. అయితే ఎవరికి ఓటు వెయ్యాలో, వేయకూడదో అనే అంశంపై సీపీఎం, సీపీఐ జిల్లా కమిటీలు రాష్ట్ర నాయకత్వాలను కోరాయి.
ఈ అంశంపై రెండు పార్టీల రాష్ట్ర నాయకత్వాలు స్థానిక జిల్లా కమిటీల నిర్ణయానికే వదిలేశాయి. రాష్ట్రంలో మతోన్మాదశక్తులను ఎదుర్కొనేందుకు తెరాస పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బహిరంగంగా మద్దతు ప్రకటించకపోయినా... అంతర్గతంగా సహకారం ఉంటుందని ఇరుపార్టీల నేతలు చర్చించుకుంటున్నారు.
ఇదీ చూడండి: అభివృద్ధిలోనే కాదు ఆహ్లాదంలోనూ సిద్దిపేట ఆదర్శం: మంత్రి హరీశ్