ETV Bharat / state

హుజూర్​నగర్​లో గిరిజన ఓట్లపై దృష్టిపెట్టిన పార్టీలు - తెరాస

హుజూర్​నగర్​ ఉపఎన్నికకు మరికొద్ది రోజులే మిగిలాయి... రాజకీయ పార్టీల ప్రచారాలు రోజు రోజుకు ఊపందుకుంటున్నాయి. నేతల హామీలు కోటలు దాటుతున్నాయి. చిన్న చిన్న ప్రజా సమస్యలు అప్పటికప్పుడే పరిష్కరిస్తూ.. పెద్ద సమస్యలకు స్పష్టమైన హామీలిస్తూ ముందుకెళ్తున్నారు బరిలో ఉన్న నేతలు. నియోజకవర్గంలోని 63 తండాల్లో 28,240 ఓట్లు ఉన్నాయి. ప్రస్తుతం వీరి ఓట్లను గాలం వేసే పనిలో పడ్డాయి ప్రధాన పార్టీలు. ఉపఎన్నికల పుణ్యమా అని తమ సమస్యలు తీరే అవకాశం వచ్చిందని గిరిజనులు అనుకుంటున్నారు.

హుజూర్​నగర్​లో గిరిజన ఓట్లపై దృష్టిపెట్టిన పార్టీలు
author img

By

Published : Oct 12, 2019, 11:48 PM IST

హుజూర్​నగర్​ ఉపఎన్నికల ప్రచారానికి పదునెక్కింది... నేతల హామీలు కోటలు దాటుతున్నాయి. ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు నేతలు చేస్తోన్న ఫీట్లు అన్నీఇన్నీ కావనే చెప్పాలి. నియోజకవర్గం పరిధిలోని ఏడు మండలాలకు గాను... ఆరు మండలాల్లో 63 తండాలున్నాయి. వీటిల్లో 60 వేలకు పైగా జనాభా ఉండగా... 28 వేల 240 మంది ఓటర్లున్నారు. వీరిపై దృష్టిపెట్టిన అధికార పార్టీ... గిరిజన నేతల్ని రంగంలోకి దింపింది. ఆ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత... తెరాస తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సమస్యలు పరిష్కరిస్తామని అక్కడికక్కడే హామీలిస్తున్నారు. 50 లక్షలతో హుజూర్​నగర్ పట్టణంలో బంజారాభవన్​తోపాటు... అన్ని గ్రామాలకు నేరుగా నిధులు కేటాయిస్తామని చెబుతున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉండే 10 వేల కోట్లలో... గ్రామాల్లోని అంతర్గత రహదారుల కోసం భారీగా కేటాయిస్తామని అంటున్నారు. పాలకవీడు మండలం శూన్యపహాడ్ నుంచి బెట్టె తండాకు... అంతర్గత రహదారి లేదు. 6 కిలోమీటర్ల బీటీ రోడ్డుకు గత నెలలో... 30 లక్షల మినరల్ ఫండ్ మంజూరు చేశారు.

మేము సైతం అంటున్న కాంగ్రెస్ నాయకులు

కాంగ్రెస్ నాయకులు సైతం... హామీలు గుప్పిస్తూ, ఓటర్లను అభ్యర్థిస్తూ ముందుకు సాగుతున్నారు. పెద్దఎత్తున ఎత్తిపోతల పథకాలు, రహదారులతో పాటు... తండాలకు సాగునీరు అందించింది ఉత్తమ్ కుమార్ రెడ్డేనని ప్రచారం చేస్తున్నారు. భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల్ని... ముందుగానే ఓటర్లకు తెలియజేస్తున్నారు. విష్ణుపురం-జగ్గయ్యపేట రైలు మార్గంలో... కేంద్రంతో పోరాడి ప్యాసింజర్​ను నడిపిస్తామని హామీ ఇస్తున్నారు. పాలకవీడు, మఠంపల్లి, మేళ్లచెరువు మండలాల పరిధిలోని 12 తండాలకు మేలు చేసేలా... మేజర్ ఎత్తిపోతల పథకాన్ని ఎంపీ నిధులతో చేపడతానని ఉత్తమ్ భరోసానిస్తున్నారు. అలాగే సాగర్ ఎడమకాల్వ పరిధిలోని ఎల్-14 కాల్వ వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించి... మూడు గ్రామాలకు నీరందిస్తామంటున్నారు. ఈ ఫీట్లేవో ఎన్నికలప్పుడు కాకుండా... మామూలప్పుడు ఉంటే ఇన్ని కష్టాలుండేవి కాదు కదా...అన్న మాటలు ప్రజల్లో వినిపిస్తున్నాయి.

హుజూర్​నగర్​లో గిరిజన ఓట్లపై దృష్టిపెట్టిన పార్టీలు

ఇవీ చూడండి: 'గల్ఫ్​లోని తెలంగాణ బిడ్డలూ.. రాష్ట్రానికి రండి..!'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.