నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో భూ వివాదంలో ఇరువర్గాలు రాళ్లతో దాడి చేసుకున్నారు. గతంలో ప్రభుత్వం ఇళ్ల స్థలాల కోసం తమకు కేటాయించిన పది గుంటల భూమిని చదును చేసుకోవడానికి వెళ్లిన వారికి... మరో వర్గం వారికి గొడవ జరిగింది.
ఆ భూమిలో తమకూ వాటా ఉందని దాయాదులు గొడవకు దిగడం వల్ల... ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరిగి ఒక వర్గంపై మరో వర్గం రాళ్లతో దాడి చేసుకున్నారు. కొట్లాటలో ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: విషాదం మిగిల్చిన ఈత సరదా