నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన చిన్నారి యశస్విని వారం రోజుల క్రితం ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడింది. తీవ్ర గాయాలు కావడంతో బంజారాహిల్స్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. పేద కుటుంబం కావడం వల్ల వైద్య ఖర్చులు భరించలేరని, చిన్నారికి మెరుగైన చికిత్స అందించడం కోసం ఆదుకోవాలని భాను ప్రతాప్ అనే యువకుడు విషయాన్ని ట్విటర్ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాడు.
దీనితో చిన్నారి వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం చేయాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. సీఎం క్యాంపు కార్యాలయ అధికారులు వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.3.50 లక్షలు మంజూరు చేశారు. సరైన సమయంలో చికిత్స అందించడంతో ప్రస్తుతం చిన్నారి క్షేమంగా ఉందని, ట్విటర్‌లో తాను పెట్టిన అభ్యర్థనను మన్నించడంతో పాటు ఆదుకున్న కేటీఆర్‌కు ధన్యవాదాలు చెబుతూ భానుప్రతాప్ మళ్లీ ట్వీట్ చేశాడు. ఈసారి నేరుగా స్పందించిన కేటీఆర్.. ‘సోదరా.. ఈ వార్త చెప్పి ఈరోజు పరిపూర్ణం చేశావు. చిన్నారికి కొంత సాయం చేయడం ఆనందంగా ఉంది’ అంటూ ట్వీట్ చేశారు.
-
You made my day brother. Delighted be of some assistance to the little girl 😊 https://t.co/4TqOnuwNdW
— KTR (@KTRTRS) February 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">You made my day brother. Delighted be of some assistance to the little girl 😊 https://t.co/4TqOnuwNdW
— KTR (@KTRTRS) February 29, 2020You made my day brother. Delighted be of some assistance to the little girl 😊 https://t.co/4TqOnuwNdW
— KTR (@KTRTRS) February 29, 2020