ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు ఒకవైపు... అలల తాకిడికి పడే తుంపర్లతో... సందర్శకుల ఆనందం మరోవైపు... నిన్న పంద్రాగస్టు, రాఖీ పౌర్ణమి సెలవు రోజు కావడం వల్ల హైదరాబాద్ జంట నగరాలతోపాటు వివిధ జిల్లాల సందర్శకులు నాగార్జునసాగర్‌కు పోటెత్తారు. సాగర్ జలాశయ ప్రాంగణం కిటకిటలాడింది. పర్యటకుల తాకిడి ఎక్కువ అవటం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సందర్శకులు నదిలో దిగకుండా ఉండేందుకు... పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.
4రోజుల్లో... 200 టీఎంసీలు
సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుతం 585 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. జలాశయానికి ఇన్‌ఫ్లో సుమారు 8 లక్షల 80 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా... 26 క్రస్ట్ గేట్ల ద్వారా 7 లక్షల 35 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అటు పులిచింతల వద్ద భారీగా వరద వచ్చి చేరుతోంది. 7 లక్షల 21 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా... 20 గేట్ల ద్వారా 7 లక్షల 10 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గత నాలుగు రోజులగా సాగర్ నుంచి రోజూ 50 టీఎంసీల చొప్పున మెుత్తం 200 టీఎంసీల నీటిని అధికారులు కిందకు వదిలారు.
ఇవీచూడండి: భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం