ETV Bharat / state

భాజపాలోకి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ?.. ఆ అంశంపై త్వరలో స్పష్టత ! - భాజపాలోకి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి

కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి భాజపాలో చేరటం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. కేసీఆర్‌ను ఎదురించేందుకు కమలంపార్టీలో చేరతానని నియోజకవర్గ ముఖ్య నాయకులతో చెప్పినట్లు సమాచారం. ఐతే..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలా? వద్దా? అనే అంశంపై త్వరలో స్పష్టత ఇస్తానని పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

భాజపాలోకి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి
భాజపాలోకి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి
author img

By

Published : Jul 28, 2022, 4:31 AM IST

నల్గొండ జిల్లా మునుగోడులో రాజకీయం హాట్‌టాపిక్‌గా మారింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పార్టీని వీడటం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో తన నివాసంలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు, నాయకులతో రాజగోపాల్‌ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో పార్టీ మారే విషయంపై కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. త్వరలోనే భాజపాలో చేరడం ఖాయమని చెప్పినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లాలా ? వద్దా ? అనే విషయం ప్రత్యేక సర్వే చేయించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పూర్తి స్థాయి సర్వే ఫలితాలు రావడానికి వారం పది రోజుల పడుతుందని.. ఆ తర్వాతే రాజకీయ భవిష్యత్‌పై నిర్ణయం తీసుకుంటానని వెల్లడించినట్లు పేర్కొన్నారు.

కేసీఆర్​ను దెబ్బతీయాలంటే కాంగ్రెస్‌ వల్ల కాదని.. భాజపానే సరైన ప్రత్యామ్నాయమని రాజగోపాల్‌ రెడ్డి చెప్పినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తనపై నమ్మకంతో వెంట వచ్చే వారికి సముచిత స్థానం కల్పిస్తానని చెప్పినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో భాజపా బలంగా లేదనేది వాస్తవం కాదని.. గతంలోనూ కాంగ్రెస్‌ పరిస్థితి ఇలాగే ఉండేదని వ్యాఖ్యానించినట్లు తెలిపారు. కేసీఆర్‌ను ఎదురించే దమ్ము తనకే ఉందని గుర్తించి మోదీ, అమిత్‌షాలు స్వయంగా భాజపాలోకి ఆహ్వానించారని పేర్కొన్నట్లు వివరించారు. కొంత మంది కార్యకర్తలు కాంగ్రెస్‌లోనే ఉండి తెరాసపై పోరాడాలని వెల్లడించగా.. మరికొందరు మద్దతిస్తామని ప్రకటించినట్లు సమాచారం.

రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించే పనిని భట్టి విక్రమార్కకి అప్పగించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ ఆయనతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమైన సీనియర్‌ నేతలు.. వివిధ అంశాలపై చర్చించారు. ఆయన్ను కాంగ్రెస్‌లోనే కొనసాగించే విధంగా మాట్లాడతామని భట్టి స్పష్టం చేశారు. మునుగోడు నియోజకవర్గంలో మరో కీలక మండలమైన చౌటుప్పల్‌ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో రాజగోపాల్‌ రెడ్డి ఇవాళ సమావేశం కానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇవీ చూడండి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.