Kishan Reddy in Munugode Bypoll Campaign: మునుగోడులో ఎన్నికల హోరు రణరంగాన్ని తలపిస్తోంది. ప్రధాన పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా కృష్ణపురంలో ప్రసంగించిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి కేసీఆర్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రానికి కాపాలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్.. వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు.
కేసీఆర్‌కు తెలంగాణ అంటే ఇష్టం పోయిందని.. అందుకే పార్టీ పేరులో తెలంగాణ తీసేసి భారత రాష్ట్ర సమితిగా మార్చుకున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం 1,200 మంది ప్రాణత్యాగాలు చేసుకున్నారని.. విద్యార్థులు మంటల్లో కాలిపోతూ జై తెలంగాణ నినాదాలు ఇచ్చింది కేసీఆర్ కుటుంబం కోసమేనా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపైన రూ.లక్ష అప్పు ఉందన్న కిషన్రెడ్డి.. కేసీఆర్ రూ.5 లక్షల కోట్లు అప్పు చేసి.. దోచుకున్న సొమ్ముతో విమానాలు కొంటున్నారని ఆరోపించారు.
ఖాళీ భూములు కనిపిస్తే తెరాస నేతలు కబ్జా చేస్తున్నారని.. లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియాకు తెరాస తెరలేపిందని కిషన్రెడ్డి విమర్శించారు. నవాబులా కేసీఆర్ తరతరాలు పాలించాలని అనుకుంటున్నారని కిషన్రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ రూ.5 లక్షల కోట్ల అప్పు చేసి దోచుకుని సొంతంగా విమానాలు కొంటున్నారని.. తెరాస నాయకులు వందల ఎకరాల భూములు దోచుకుంటున్నారన్నారు. తెరాస నేతలు భూ దోపిడీని అడ్డుకుంటే కేసులు పెడుతున్నారని విమర్శించారు.
ఇవీ చదవండి: