తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని బీడు భూములన్నీ పంటలతో కళకళలాడుతున్నాయని నల్గొండ జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ తెలిపారు. జిల్లాలోని శాలిగౌరారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. వానాకాలం పంట సాగు కోసం శాలిగౌరారం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు. రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
మండలంలోని వంగమర్తిలో సంజీవని ట్రస్ట్ చేపట్టిన నిత్యావసరాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కిశోర్ కుమార్ పాల్గొన్నారు. పేదలకు సరకులు పంచిపెట్టారు. ఈ కార్యక్రమం చేపట్టిన రఫెల్‌ను ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి: లక్ష్మణ్ అరెస్ట్.. ఎంపీ అర్వింద్ గృహనిర్బంధం