ETV Bharat / state

నియంత్రిత సాగుతో దేశానికి సందేశం: గుత్తా సుఖేందర్ - నియంత్రిత వ్యవసాయ సాగు విధానం రైతులకు ఎంతో లాభసాటి: గుత్తా సుఖేందర్

దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ వ్యవసాయ విధానం ఆదర్శంగా నిలుస్తోందని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో సాగవుతున్న పంటలపై ఆయన ఆరా తీశారు. రైతులు లాభం గడించే విధంగా కేసీఆర్ ప్రభుత్వం పంటల మార్పిడి విధానానికి శ్రీకారం చుట్టిందని వెల్లడించారు. ప్రతిపక్షాలు అర్థం లేకుండా, అసత్య ప్రచారం చేయవద్దని హితవు పలికారు.

KCR government has embarked on a crop transplantation program to benefit farmers
నియంత్రిత సాగుతో దేశానికి సందేశం: గుత్తా సుఖేందర్
author img

By

Published : May 27, 2020, 12:29 PM IST

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నియంత్రిత వ్యవసాయ సాగు విధానం రైతులకు ఎంతో లాభసాటిగా ఉంటుందని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ వ్యవసాయ విధానం ఆదర్శంగా నిలుస్తోందని స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలో సాగవుతున్న పంటలపై ఆయన ఆరా తీశారు. రైతులు లాభం గడించే విధంగా తెలంగాణ ప్రభుత్వం పంటల మార్పిడి విధానానికి శ్రీకారం చుట్టిందన్నారు.

డిమాండ్ ఉన్న పంటలకు అధిక లాభాలు

ప్రతిపక్షాలు అర్థం లేకుండా, అసత్య ప్రచారం చేయవద్దని హితవు పలికారు. వ్యవసాయంపై కనీసం అవగాహన లేని కొంతమంది కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు గుడ్డిగా నియంత్రిత పంటల విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. డిమాండ్ ఉన్న పంటలను పండించి అధిక లాభాలు పొందే ఈ విధానాన్ని రైతులు అందరూ స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. యాసంగి సీజన్ లో ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేసిందని తెలిపారు. పోతిరెడ్డిపాడు పాడు ,పులిచింతల ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ నాయకులు ద్వంద్వ వైఖరిని అవలంభిస్తున్నారని విమర్శించారు.

ఇదీ చూడండి: 'వెయ్యి వెంటిలేటర్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.