KA PAUL Fires ON Officer in Munugode: మునుగోడు నియోజకవర్గం చండూరులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అధికారితో వాగ్వాదానికి దిగారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వికాస్‌రాజ్ తన ఫాలోవర్ అంటూ.. విధుల్లో ఉన్న ఓ అధికారిపై తన ప్రతాపం చూపాడు. తనను ఆపే అధికారం మీకు ఎవరు ఇచ్చారంటూ ప్రశ్నించారు. బీకేర్‌ఫుల్.. తెలంగాణకు కాబోయే సీఎం నేనే అంటూ హెచ్చరించారు.
కేఏ పాల్‌కు చెందిన రెండు ప్రచార వాహనాల్లో చండూరులో ప్రచారం నిర్వహిస్తున్నారు. వాటి వెనకాలే వస్తున్న కేఏ పాల్‌ను అధికారులు అడ్డుకున్నారు. దీంతో కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రిని అని.. తనకు మర్యాద ఇవ్వండి అంటూ మండిపడ్డారు.
అనంతరం నల్గొండ జిల్లా చండూరు మండలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేఏ పాల్ మాట్లాడారు. 1,200 మంది అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయకుండా తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్లకిస్తామన్న మూడెకరాల భూమి, ఇల్లు ఇవ్వకుండా కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందని కేఏ పాల్ ఆరోపించారు. ప్రజలను నమ్మించి మోసం చేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు.
ఇవీ చదవండి: