నల్గొండ జిల్లా దేవరకొండలోని విష్ణు లాడ్జిలో బస చేసి ఫీల్డుకు వెళ్తున్న జియోలాజికల్ ట్రైనింగ్ బృందాన్ని విద్యార్థి జేఏసీ నేతలు అడ్డుకున్నారు. గత మూడు రోజులుగా జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ వాహనం దేవరకొండ, పీఏపల్లి ప్రాంతాల్లో తిరుగుతుంది. యురేనియం నిక్షేపాల ప్రాంతంలో పరీక్షల కోసం వచ్చారంటూ విద్యార్థి జేఏసీ నేతలు అడ్డుకుని గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు బృంద సభ్యులతో మాట్లాడగా తాము కేవలం శిక్షణలో భాగంగా వచ్చామని... యురేనియం కోసం రాలేదని చెప్పారు. అయినా విద్యార్థి సంఘాల నేతలు శాంతించకపోవడం వల్ల ట్రైనింగ్ బృందం వెనక్కు వెళ్లింది.
ఇదీచూడండి: రైతు సమస్యలపై శాసనసభలో పోరాటం: సీఎల్పీ