Gold Medals for India : శ్రీలంకలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఛాంపియన్షిప్ పోటీల్లో నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తి రెండు బంగారు పతకాలు గెలుచుకుకున్నారు. అండర్ -45 విభాగంలో 100 మీటర్ల పరుగు పందెం, షాట్పుట్ క్రీడల్లో జిల్లాకు చెందిన గుర్రం పోడు మండలం వద్దిరెడ్డి గూడేనికి చెందిన మేకల భాస్కర్ రెడ్డి గోల్డ్ మెడల్ సాధించారు.
Gold Medals for India in International Championship Srilanka : ఈ క్రీడలు ఈనెల 10 నుంచి శ్రీలంకలో జరుగుతున్నాయి. భారత్ తరఫున రెండు విభాగాల్లో బంగారు పతకాలు గెలవడం చాలా గర్వకారణంగా ఉందని భాస్కర్ రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో అనేక పతకాలు గెలిచి దేశానికి కీర్తి తెస్తానని తెలిపారు.
ఇదీ చదవండి : father and son win: అంతర్జాతీయ ఛాంపియన్షిప్ పోటీల్లో సత్తా చాటిన తండ్రీకొడుకులు