నల్గొండ జిల్లాలో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దేశ స్వాతంత్య్రం, తెలంగాణ రాష్ట్రం కోసం అసువులు బాసిన అమరుల త్యాగాలను ఆయన గుర్తుచేసుకున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాలలో దూసుకెళ్తోందన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి పునాదులతోనే ఆగిపోయిన పలు ప్రాజెక్టులను కార్యరూపంలోకి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ ఏవీ.రంగనాథ్, తదితరులు పాల్గొన్నారు.
మిర్యాలగూడలో జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే
నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే భాస్కరరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎంతోమంది మహానుభావుల త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం సిద్ధించిందని ఆయన గుర్తుచేశారు. వారి త్యాగాలను స్మరించుకోవడం మన బాధ్యతని తెలిపారు. కొవిడ్ కారణంగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిరాడంబరంగా జరుపుకుంటున్నామన్నారు. స్వాతంత్య్ర ఫలాలను నేడు మనం అనుభవిస్తున్నామని, వాటిని భావితరాలకు అందిస్తూ స్ఫూర్తి దాయకంగా ఉండాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా, తాగు, సాగునీటి రంగాలలో ముందుకెళ్తోందని అన్నారు.
ఇవీ చూడండి: స్వాతంత్య్ర వేడుకల్లో జెండావిష్కరించిన మంత్రి ఈటల