నల్గొండ జిల్లా త్రిపురారం, బాబు సాయి పేట, పెద్ద దేవులపల్లి సహకార సంఘాల్లో నేడు పాలక వర్గాలు పాలనా బాధ్యతలు చేపట్టాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగార్జున సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హాజరయ్యారు.
మూడు ప్రాథమిక సహకార సంఘాలకు డైరెక్టర్లు, ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు చొప్పున మొత్తం 12 మంది ఎమ్మెల్యే సమక్షంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రైతులకు నిత్యం అందుబాటులో ఉంటూ ఎరువులు, విత్తనాల కొరత రాకుండా చూసుకుంటామని పాలకవర్గాలు రైతులకు హామీ ఇచ్చాయి.
ఇదీ చూడండి: నిర్భయ దోషులకు డెత్ వారెంట్- మార్చి 20న ఉరి అమలు