పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే నాగర్జునసాగర్ ఉప ఎన్నికల బరిలో నిలుస్తానని తెరాస ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి పేర్కొన్నారు. నల్గొండ జిల్లా హాలియాలో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పోలియో చుక్కల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తేరా స్పష్టం చేశారు. భాజపా నేతలతో సంప్రదింపులు జరిపారంటూ.. వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. సీఎం కేసీఆర్కు.. తాను నమ్మిన బంటునని పేర్కొన్నారు.
నాగర్జునసాగర్ ఉప ఎన్నికల్లో.. అధిష్ఠానం టికెట్టు ఎవరికిచ్చినా గెలిపించుకోవాడానికి తాము సిద్ధంగా ఉన్నామని తేరా పేర్కొన్నారు. తెరాస సంక్షేమ పథకాలే.. పార్టీని గెలిపిస్తాయని కొనియాడారు.
ఇదీ చదవండి: పల్లెల్లో కక్ష సాధింపులు.. ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపితే బెదిరింపులు