నల్గొండ జిల్లా మునుగోడు మండలం చీకటిమామిడి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో ముత్యాలు తన భార్య జయమ్మను దారుణంగా చంపేశాడు. గీస కత్తితో కిరాతకంగా హతమార్చాడు.
వీళ్లకు ఇద్దరు కూతుళ్లు, ఒకరు కుమారుడు సంతానం. ఇటీవలే కుమారుడి వివాహం జరిగింది. కొడుకు పని నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లగా... కోడలు పుట్టింటికి వెళ్లింది.
శనివారం రాత్రి భార్యాభర్తలకు చిన్నపాటి గొడవ జరిగింది. అది కాస్తా హత్యకు దారితీసింది. నిందితుడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
ఇదీ చూడండి.. తండాలో అగ్నిప్రమాదం... భారీ ఆస్తినష్టం