పచ్చదనం పెంచేందుకు శ్రీకారం చుట్టిన హరితహారం కార్యక్రమం నేడు నల్గొండ జిల్లాలో అనేక మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇప్పటికే నాలుగు విడతలు పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. వినూత్న ఆలోచనతో ఐదో విడతకు శ్రీకారం చుట్టింది. ప్రతి గ్రామంలో నర్సరీని ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ ఆధ్వర్యంలో వనాలను ఏర్పాటు చేసింది.
రైతులతో ఒప్పందం చేసుకొని వారి పొలాల్లోనే నర్సరీలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇందుకోసం నెలకు రూ.3 వేలు అద్దె రూపంలో చెల్లిస్తోంది. ఉపాధి హామీ పథకం ఒక్కో నర్సరీకి నలుగురిని సంరక్షులుగా నియమించి వారికి పని కల్పిస్తోంది.
గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటుచేయడం వల్ల ఉపాధి కోసం ఎదురుచూసే పరిస్థితి పోయిందని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: నిండుకుండలా మేడిగడ్డ... అన్నారంకు గోదారమ్మ