నల్గొండ జిల్లా ఉదయ సముద్రం- బ్రాహ్మణ వెల్లెంల ఎత్తిపోతల ప్రాజెక్టు పథకాన్ని చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం వహిస్తోందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. "రైతు సాధన పాదయాత్ర" నిర్వహణకు అనుమతి ఇవ్వాలంటూ ఈ నెల 19న రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చినట్లు ఎంపీ తెలిపారు. రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్‌భగవత్‌ను వివరణ కోరినా దీనిపై స్పందన లేదని మండిపడ్డారు. న్యాయస్థానం ద్వారా పాదయాత్రకు అనుమతి తెచ్చుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. ఆ తరువాతే తేదీలను ఖరారు చేస్తామని స్పష్టం చేశారు.
రైతు సాధన పాదయాత్రకు అనుమతి ఇవ్వండి:ఎంపీ కోమటిరెడ్డి
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేపట్టిన రైతు సాధన పాదయాత్రకు పోలీసు శాఖ అనుమతి నిరాకరించింది. ఈ విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని కాంగ్రెస్ భావిస్తోంది.
నల్గొండ జిల్లా ఉదయ సముద్రం- బ్రాహ్మణ వెల్లెంల ఎత్తిపోతల ప్రాజెక్టు పథకాన్ని చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం వహిస్తోందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. "రైతు సాధన పాదయాత్ర" నిర్వహణకు అనుమతి ఇవ్వాలంటూ ఈ నెల 19న రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చినట్లు ఎంపీ తెలిపారు. రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్‌భగవత్‌ను వివరణ కోరినా దీనిపై స్పందన లేదని మండిపడ్డారు. న్యాయస్థానం ద్వారా పాదయాత్రకు అనుమతి తెచ్చుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. ఆ తరువాతే తేదీలను ఖరారు చేస్తామని స్పష్టం చేశారు.
TAGGED:
KOMATIREDDY