నాగార్జునసాగర్ ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రంని జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు సందర్శించారు. 8వ యూనిట్లో జరుగుతున్న మరమ్మత్తులను పర్యవేక్షించి పలు సూచనలు చేశారు. నాగార్జునసాగర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి 1250 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగినట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. గత నెల 26న అధికంగా 13వేల 688 మెగావాట్ల విద్యుత్ వాడకం ఉన్నట్లు తెలిపారు. ఇది గతంలో 13 వేల 168 మెగావాట్లుగా ఉండేదని స్పష్టం చేశారు. ఎండాకాలం కావడం వల్ల విద్యుత్ వాడకం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.14 వేల మెగావాట్ల వాడకం అయిన ఎలాంటి విద్యుత్ ఇబ్బంది లేదన్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోకి వచ్చే వారు తప్పక కరోనా నిబంధనలు పాటించాలి అని సూచించారు.
ఇదీ చదవండి: మదిలో మాతృత్వం.. మరవని కర్తవ్యం