ETV Bharat / state

గౌరవం పెంచి.. వేతనాలు ఇచ్చి...

కరవు కాలంలో సర్పంచులకు వేతనాలు అందజేస్తోంది ప్రభుత్వం. ఉన్న జీతం నుంచి కోత విధిస్తున్న ఈ సమయంలో... గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న సర్పంచులకు ఎలాంటి కోత లేకుండానే పూర్తి గౌరవ వేతనం అందించనున్నారు.

గౌరవం పెంచి..వేతనాలు ఇచ్చి
full salaries to sarpanches in nalgongonda district
author img

By

Published : May 6, 2020, 12:43 PM IST

కరోనా దెబ్బతో వ్యవస్థలన్నీ లాక్‌డౌన్‌ అయిన వేళ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులకు 2020-21 మొదటి త్రైమాసికానికి సంబంధించిన గౌరవ వేతనాలను విడుదల చేసింది. ప్రతి సర్పంచికి నెలకు 5 వేల రూపాయల చొప్పున గౌరవవేతనం ఇస్తోంది. ఈ క్రమంలోనే ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల మొత్తాన్ని ఒకేసారి విడుదల చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఆయా జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ఈ మొత్తాన్ని జిల్లా అధికారులు ఆయా గ్రామ పంచాయతీల ఖాతాలకు బదిలీ చేయనున్నారు.

ఒక్కో సర్పంచికి రూ.15 వేలు చొప్పున వేతనం అందనుంది. వేతనం తీసుకోవాలంటే ఉపసర్పంచి సంతకం తప్పనిసరి. రాష్ట్ర ప్రభుత్వం కరోనా సమయంలో ప్రజాప్రతినిధులు, కొన్ని విభాగాల ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి కోత విధిస్తున్న విషయం తెలిసిందే. గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న సర్పంచులకు ఎలాంటి కోత లేకుండానే పూర్తి గౌరవ వేతనం అందించనున్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1,653 గ్రామ పంచాయతీలకు సర్పంచులు ఉన్నారు. వీరందరికీ మూడు నెలల కాలానికి కలిపి రూ.2.61 కోట్లను విడుదల చేస్తూ జీవో విడుదల చేసింది.

కోత లేకుండా ఇవ్వడం సంతోషించదగ్గ విషయం

- చింతల యాదగిరి గౌడ్‌, సర్పంచి, చర్లగౌరారం, కనగల్‌ మండలం, నల్గొండ

సంక్లిష్ట సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కోత పెట్టకుండా గౌరవ వేతనాలు ఇవ్వడం సంతోషించదగ్గ విషయం. గ్రామ పంచాయతీల అభివృద్ధికి పాటుపడుతున్న మా కృషికి తగ్గ ఫలితంగా భావిస్తున్నా. ఇలానే ప్రోత్సహిస్తే గ్రామాలను మరింత అభివృద్ధి చేస్తాం.

కరవు కాలంలో ప్రోత్సాహం

- బొర్రాజు సైదమ్మ, సర్పంచి, చెరకుపల్లి, మాడ్గులపల్లి మండలం, నల్గొండ

గ్రామంలో కరోనా వ్యాప్తిచెందకుండా మేము చేస్తున్న కృషికి ఈ వేతనాలు అందడం మరింత ప్రోత్సాహకం. జూన్‌ నెల వేతనం కూడా ముందుగానే ఇవ్వడం గొప్పవిషయం. గ్రామంలో అత్యవసర ఇబ్బంది ఎదురైతే ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తాం.

ఇదీ చూడండి: భారత్​లో 'విద్య' కోసం అమెరికా భారీ రుణసాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.