నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం చెర్వుగట్టు రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. చివరి కార్తీక సోమవారం కావటం వల్ల భక్తులు భారీగా తరలి వచ్చారు. వేకువజాము నుంచే ఆలయానికి చేరుకొని దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. రేపు అమావాస్య కావటంవల్ల భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఆలయ అధికారులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఇవీ చూడండి: సాయం చేయండి.. పసివాడికి ప్రాణం పోయండి